ఎస్.ఎస్.పిక్చర్స్ బ్యానర్ పై, ఎస్.ఎస్. పట్నాయక్ రచన,దర్శకత్వంలో సదాశివుని శిరీష నిర్మాతగా, మామిడి సాంబమూర్తి, కొత్తకోట బాలకృష్ణ మరియు PVS రామ్మోహన్ రావు సహనిర్మాతలు గా నిర్మితమైన “పద్మశ్రీ ” సినిమా ట్రైలర్ ఆవిష్కరణ ఫిలింఛాంబర్లో ప్రముఖ పాత్రికేయులు చేతులమీదుగా జరిగినది.
చిత్ర దర్శకుడు ఎస్.ఎస్. పట్నాయక్ మాట్లాడుతూ ఈ రోజు తన జన్మదినం అని, ఈ జన్మదిన వేడుకను ఇలా ట్రైలర్ లాంచ్ ద్వారా పాత్రికేయులు నడుమ ఫిలింఛాంబర్లో జరుపుకోవడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని కొనియాడుతూ… తను కూడా జర్నలిజం బ్యాక్ గ్రౌండ్ తో వచ్చిన వ్యక్తిని కాబట్టి జర్నలిస్ట్ కష్టనష్టాలు సాధకబాధకాలు తనకు తెలుసు కాబట్టి తన పుట్టిన రోజు నాడు జర్నలిస్టుల చేతుల మీదుగా తన దర్శకత్వం వహించిన పద్మశ్రీ చిత్ర ట్రైలర్ ని విడుదల చేయడం ఇది ఒక గౌరవంగా భావిస్తున్నానని జర్నలిస్టులతో ట్రైలర్ని విడుదల చేయించారు.
ఈ చిత్రంలో హీరోగా పరిచయమైన కిషోర్ కుమార్, హీరోయిన్ సంధ్యారాణి మాట్లాడుతూ… ఈ చిత్రం ఒక కొత్త ప్రయోగాత్మక చిత్రం అని ఈ చిత్రం విడుదల తర్వాత వారికి మరెన్నో అవకాశాలు వస్తాయని తన ఆశాభావాన్ని వ్యక్తపరిచారు.
ఈ చిత్ర సహనిర్మాత కొత్తకోట బాలకృష్ణ మాట్లాడుతూ అంతా కొత్త వారైనా నటీనటులతో ఇంత చక్కగా దర్శకుడు చేయించడం దర్శకునికి చిన్ననాటి స్నేహితులు గా తను ఎంతో గర్వపడుతున్నానని తన ఆనందాన్ని, ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందనే ఆశాభావాన్ని వ్యక్తపరిచారు.


