“ఆదిపురుష్”లో బ్యూటిఫుల్ నెంబర్ తెరకెక్కుతుందా.?

“ఆదిపురుష్”లో బ్యూటిఫుల్ నెంబర్ తెరకెక్కుతుందా.?

Published on Mar 26, 2021 8:00 PM IST

prabhas Adipurush

ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన పాన్ ఇండియన్ సినిమాల్లో బిజీ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఒక పక్క ప్రశాంత్ నీల్ తో భారీ యాక్షన్ థ్రిల్లర్ “సలార్” చేస్తుండగా మరోపక్క బాలీవుడ్ స్టార్ దర్శకుడు ఓంరౌత్ తో “ఆదిపురుష్” అనే మహా ఇతిహాస కావ్యం చేస్తున్నాడు. ఒకదాని తర్వాత ఒకటి గ్యాప్ లేకుండా ప్రభాస్ బిజీగా ఉన్నాడు. అయితే ఇప్పుడు ప్రభాస్ ఆదిపురుష్ షూట్ లోనే ఉన్నాడు.

మరి లేటెస్ట్ ఇన్ఫో ప్రకారం ఆదిపురుష్ లో ఒక బ్యూటిఫుల్ అండ్ విజువల్ వండర్ సాంగ్ తెరకెక్కుతుందని బజ్ వినిపిస్తుంది. ప్రస్తుతం మేకర్స్ ఈ పనుల్లో బిజీగా ఉన్నారు. ఇక ఈ భయారే బడ్జెట్ చిత్రంలో ప్రభాస్ సరసన సీతగా కృతి సనన్ హీరోయిన్ గా నటిస్తుండగా సన్నీ సింగ్ లక్ష్మణ పాత్రలో నటిస్తున్నాడు. మరి అలాగే పవర్ ఫుల్ రావణ పాత్రలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ డిఫరెంట్ గెటప్ లో కనిపించనున్నాడు. అలాగే ఈ చిత్రం వచ్చే ఏడాది ఆగష్టు 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు