పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ సినిమా ‘వకీల్ సాబ్’ మీద ప్రేక్షకుల్లో ఏ స్థాయి అంచనాలున్నాయో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ‘అజ్ఞాతవాసి’ తర్వాత పవన్‌ను వెండితెర మీద చూడబోతున్నామనే ఎగ్జైట్మెంట్లో ఉన్నారు అభిమానులు. ఏప్రిల్ నెల 9న సినిమా రిలీజ్ కానుంది. సినిమా మీదున్న అంచనాల మూలంగా థియేట్రికల్ బిజినెస్ భారీగానే జరిగింది. స్టార్ హీరోల సినిమాలంటే ఫస్ట్ వీకెండ్ చాలా ముఖ్యం కాబట్టి స్పెషల్ షోలు వేస్తుంటారు. సంబంధిత అధికారులు కూడ అందుకు అనుమతులిస్తుంటారు.
ఈసారి ‘వకీల్ సాబ్’ సినిమాకు కూడ అలాంటి స్పెషల్ షోలే ఉంటాయట. సిటీలో ఉదయం 7 గంటలకు అదనపు షోలు ఉంటాయట. అలాగే నైజాంలోని ఇంకొన్ని ఏరియాల్లో వేకువజామున 5 గంటకే నుండే షోలు ప్రదర్శించాలని చూస్తున్నారట డిస్ట్రిబ్యూటర్లు. మొత్తానికి సినిమాకు 5, 6 షోలు పడేలా ప్రయత్నాలు జరుగుతున్నాయట. బాలీవుడ్ చిత్రం ‘పింక్’కు ఇది తెలుగు రీమేక్. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వహించిన ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించారు. బోనీ కపూర్ సమర్పణలో దిల్ రాజు బ్యానర్ పై రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఇందులో శృతి హాసన్ కథానాయికగా నటించగా అంజలి, నివేతా థామస్, అనన్య నాగళ్ళ కీలక పాత్రలు చేశారు.


