మైకేల్ మూవీ ట్రైలర్ విడుదల..!!

మైకేల్ మూవీ ట్రైలర్ విడుదల..!!

Published on May 14, 2021 10:00 AM IST

Michael

కిరణ్ దర్శకత్వం లో, వన్ మీడియా బ్యానర్ పై పార్ధు రెడ్డి నిర్మిస్తున్న చిత్రం మైకేల్. సాయి చరణ్ తేజ్ , ఆదిత్య శివ, శేఖర్ జిఎంఎస్, చిరంజీవి, మారుతీ సాకారం, మణిరాజ్, పవన్.జి, చిన్న నరసింహులు, అవినాష్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది.. ఇటీవలే విడుదలైన చిత్రం ఫస్ట్ లుక్ మంచి రెస్పాన్స్ రాగా నేడు ఈ చిత్రం యొక్క థియరిటికల్ ట్రైలర్ ని రిలీజ్ చేశారు చిత్ర బృందం.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత పార్థు రెడ్డి మాట్లాడుతూ.. సినిమాను చూశాను చాలా బాగా వచ్చింది.. దర్శకుడు చెప్పిన దానికన్నా చాలా బాగా సినిమా ని తెరకెక్కించాడు. అందరు కొత్తవాళ్లే అయినప్పటికీ ఎంతో అనుభవం ఉన్న నటుల్లా నటించారు.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకున్న మా సినిమాను త్వరలోనే విడుదల చేస్తాం అన్నారు. నవీన్ ప్రకాష్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా ప్రవీణ్ కుమార్ అడిషనల్ స్క్రీన్ ప్లే , డైలాగ్స్ అందించారు.

ట్రైలర్ చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు