బన్నీ మాస్ కాంబోపై పెరుగుతున్న బజ్.!

బన్నీ మాస్ కాంబోపై పెరుగుతున్న బజ్.!

Published on May 26, 2021 5:03 PM IST

Allu arjun
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇమేజ్ ని మాస్ లో ఒక రేంజ్ కి దర్శకుడు ఎవరా అంటే అది ఖచ్చితంగా మాస్ పల్స్ బాగా తెలిసిన దర్శకుడు బోయపాటి శ్రీను అని చెప్పాలి. అప్పటి వరకు సూపర్ స్టైలిష్ గా కనిపించిన బన్నీని ఊరమాస్ రోల్ లో చూపించి హిట్ కొట్టారు. ఇక ఆ చిత్రం తర్వాత నుంచి మళ్ళీ ఈ మాస్ కాంబోలో మరో సినిమా పడలేదు. కానీ ఇప్పుడు మళ్ళీ ఆ కాంబో రిపీట్ అవ్వనున్నట్టుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

అయితే జస్ట్ టాక్ గా మొదలయినా ఇప్పుడు ఈ క్రేజీ కాంబోపై బజ్ మరింత పెరుగుతుంది. ప్రస్తుతం బన్నీ చేస్తున్న పుష్ప తర్వాత ఉంటుందా లేక మరెప్పుడు ఉంటుందా అన్నది క్లారిటీ లేదు కానీ బన్నీ కి ఆల్రెడీ బోయపాటి లైన్ వినిపించడం బన్నీ సుకుముఖంగానే ఉన్నారు అని గాసిప్ ఉంది. మరి ఇందులో ఎంత వరకు నిజముందో కాలమే నిర్ణయించాలి.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు