స్టార్ హీరోల సినిమాలు అంటే భారీ బడ్జెట్ పెట్టి తీస్తారు. అందుకే ఈ భారీ సినిమాల్లో ప్రధాన పాత్రతో పాటు మరో బలమైన పాత్రను దర్శకులు రాసుకుంటున్నారు. పైగా ఆ పాత్ర కోసం సీనియర్ స్టార్లను అప్రోచ్ అవుతూ వారిని ఆ పాత్రకు ఒప్పించి మల్టీస్టారర్ మూవీని ఫిక్స్ చేస్తున్నారు. బన్నీ ‘సన్నాఫ్ సత్యమూర్తి’ చిత్రంలో ఉపేంద్ర ఒక ప్రముఖ పాత్ర చేసి మంచి ఫీడ్ బ్యాక్ అందుకున్నారు. ఇప్పుడు అఖిల్ సినిమాలో కూడ అదే జరగనుందట.
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ ఒక సినిమా చేయనున్నాడు. ఇది కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్. కేవలం అఖిల్ ను దృష్టిలో పెట్టుకునే కథ రాసుకున్నట్టు సురేందర్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఈ సినిమా అఖిల్ కెరీర్లో ‘రేసు గుర్రం’ లాంటి చిత్రం అవుతుందని కూడ అన్నారు. ఈ చిత్రం ఒక స్పై థ్రిల్లర్ గా ఉండనుంది. ఇందులో కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర చేత ఒక కీలకమైన పాత్ర చేయించాలని అనుకుంటున్నారట సురేందర్ రెడ్డి. ఈమేరకు ఉపేంద్రను అప్రోచ్ కావడం కూడ జరిగిందని చెప్పుకుంటున్నారు. మరి ఆ వార్తల్లో ఎంత మాత్రం నిజముందో తెలియాలంటే ఇంకొన్నాళ్ళు ఆగాల్సిందే.


