‘ఆదర్శ కుటుంబం’ ఇందుకే వాయిదా పడిందా!?

‘ఆదర్శ కుటుంబం’ ఇందుకే వాయిదా పడిందా!?

Published on Sep 23, 2026 11:30 PM IST

రానున్న కొన్ని రోజుల్లో తెలుగు సినిమా నుంచి మరిన్ని సినిమాలు సందడి చేయనున్న సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రాల్లో వెంకీ మామ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన ఫ్యామిలీ డ్రామా ఆదర్శ కుటుంబం కూడా ఒకటి. మంచి బజ్ ఉన్న ఈ చిత్రాన్ని మేకర్స్ ఓ వారం వాయిదా వేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు.

అయితే ఈ వాయిదాకి గల కారణాల్లో సినిమా షూటింగ్ ఇంకొంచెం బాలన్స్ ఉండడం కూడా అట. వెంకీ మామ కూడా నేడే తన పార్ట్ షూట్ ని కంప్లీట్ చేసుకున్నట్టు తెలుస్తుంది. దీనితో ఆదర్శ కుటుంబం కి సమయం సరిపోనందున ఓ వారం వాయిదా వేసినట్టు టాక్. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా హారికా హాసిని ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ఈ అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కాబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు