E.I.P.L పతాకంపై వి.జే సన్నీ, శ్రీ తేజ్, ఆషిమా నర్వాల్, తరుణీ, నటీనటులు గా వెలిగొండ శ్రీనివాస్ దర్శకత్వంలో సంజీవ రెడ్డి నిర్మిస్తున్న తాజా చిత్రం సకల గుణాభి రామ. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్ర యూనిట్ హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో సినీ పాత్రికేయుల సమక్షంలో ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు.
ఈ కార్యక్రమంలో చిత్ర హీరో వి.జే సన్నీ మాట్లాడుతూ, తన జర్నీ మీడియా నుంచే ప్రారంభమైందని, తను ఫస్ట్ సీరియల్ ఆర్టిస్ట్ గా పని చేసినట్లు తెలిపారు. ఆ తరువాత సినిమా మీద ఇష్టం తో మూవీస్ లోకి వచ్చానని, తను సినిమాలలోకి రావడానికి హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఇన్స్పిరేషన్ అంటూ చెప్పుకొచ్చారు. ఆయన మన మధ్య లేకపోవడం దురదృష్టకరమని, తరువాత తనని హీరో గా చేసిన డైరెక్టర్ వెలిగొండ శ్రీనివాస్ గారు మరో ఇన్స్పిరేషన్ అని, ఆయనకు ప్రత్యేక ధన్యవాదములు అంటూ చెప్పుకొచ్చారు. మీడియా నుండి సీరియల్ కు ఇప్పుడు హీరో గా చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ సినిమాకు వర్క్ చేసిన డి.ఓ.పి నళినీ కాంత్ కెమెరా వర్క్ సూపర్బ్ అని చెప్పవచ్చు, ఇంక మ్యూజిక్ డైరెక్టర్ అనుదీప్ చాలా మంచి సంగీతం ఇచ్చారని, ఇందులోని యూ ఒక సాంగ్ ఈ ఇయర్ లో ఒక ట్రెండ్ సెట్ చేస్తుందని తెలిపారు. అలాగే నిర్మాత సంజీవ రెడ్డి గారు ఖర్చుకి వెనకాడ కుండా సినిమాను పూర్తి చేశారని, ఈ మూవీ చాలా బాగా వచ్చిందని, అందరికీ కచ్చితంగా నచ్చుతుందని తెలిపారు.
హీరోయిన్స్ ఆషిమా నర్వాల్, తరుణి లు మాట్లాడుతూ, తమకు ఇంతమంచి సినిమాలో నటించే అవకాశం కల్పించిన నిర్మాత సంజీవ రెడ్డి, మరియు చిత్ర దర్శకుడు శ్రీనివాస్ వెలిగొండ శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలిపారు. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ అనుదీప్ మంచి మ్యూజిక్ ఇచ్చాడని, అలాగే తన కో స్టార్స్ సన్నీ అందరూ చాలా బాగా సహకరించారు అని అన్నారు. కుటుంబ సమేతంగా వచ్చి చూడవలసిన ఈ సినిమాను ప్రేక్షకులందరూ ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నామని అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ, ప్రతి సినిమాకు కథతో పాటు పాటలు కూడా ఎంతో ముఖ్యమని, ఈ సినిమాకు సింహ మూడు పాటలు రాయడం జరిగిందని, తాను రాసిన పాటలు చాలా బాగా వచ్చాయని అన్నారు. ఈ చిత్ర దర్శక, నిర్మాతల సహకారంతో చిత్రంలోని పాటలు చాలా బాగా వచ్చాయి, ఈ సినిమా ప్రతి ఒక్కరికీ నచ్చుతుందని అన్నారు.
పాటలు రచయత సింహ మాట్లాడుతూ, ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతకు మరియు డైరెక్టర్ కి ధన్యవాదాలు అని అన్నారు. ఈ మూవీ లో మూడు పాటలు రాశానని, చాలా బాగా వచ్చాయని, ఈ మూవీ సాంగ్స్ ఈ మూవీ ని చూసి తనను ఆదరిస్తారు అని కోరుకుంటున్నాను అని వ్యాఖ్యానించారు.
డి.ఓ.పి నళిని కాంత్ కొండపల్లి మాట్లాడుతూ, ఈ అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు అని అన్నారు
చిత్ర దర్శకుడు వెలిగొండ శ్రీనివాస్ మాట్లాడుతూ, తను మంచి కాన్సెప్ట్ తో ఈ కథను తయారు చేసుకొని నిర్మాతలు సంజీవరెడ్డి గారికి ఈ కథ చెప్పడం జరిగిందని అన్నారు. నిర్మాతలకు చెప్పిన కథ నచ్చడంతో తన మీద నమ్మకంతో ఈ మూవీని E.I.P.L బ్యానర్ మీద చెయ్యడానికి ఒప్పుకున్నారని అన్నారు. సినిమాకు కావలసిన ఏర్పాట్లు చేసుకొమ్మని చెప్పడమే గాక ఖర్చు గురించి వెనకాడవద్దు అని ప్రోత్వహించారు అంటూ చెప్పుకొచ్చారు, బాను మరియు నందు తన రైటింగ్స్ లో తనకు చాలా సహకారం అందించారని, వాళ్ళకి తన కృతజ్ఞతలు అని అన్నారు. హీరోలు వి.జె. సన్నీ, నారప్పలో నటించిన శ్రీతేజ్, మరియు హీరోయిన్ లు చాలా చక్కగా నటించారు అని ప్రశంసించారు. సకల గుణాలు కలిగిన రాముడు అయినా భర్త తో భార్య భర్తల మధ్య ఎమోషన్స్ రొమాన్స్ మరియు కామెడీ మధ్య జరిగే సినిమానే మా సకల గుణాభి రామ అని, మంచి కాన్సెప్ట్ తో వస్తున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులందరూ ఆదరించి ఆశీర్వదించాలని అన్నారు.
చిత్ర నిర్మాత సంజీవ రెడ్డి మాట్లాడుతూ, శ్రీనివాస్ వెలిగొండ తనకు కథ చెప్పడంతో ఈ కథ డీఫ్రెంట్ గా అనిపించి సినిమా చెయ్యడానికి ఒప్పుకున్నట్లు తెలిపారు. సినిమా బాగా వచ్చిందని, అనుదీప్ మంచి సంగీతం అందించాడని, సినిమా షూటింగ్ పూర్తి చేసుకుందని, త్వరలో అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని అన్నారు. అంతేకాక ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ చిత్రం గొప్ప విజయం సాధించాలని అన్నారు.


