అందరి మనసు దోచుకుంటున్న “ఇచ్చట వాహనములు నిలుపరాదు” ట్రైలర్!

అందరి మనసు దోచుకుంటున్న “ఇచ్చట వాహనములు నిలుపరాదు” ట్రైలర్!

Published on Aug 24, 2021 5:00 PM IST

IVNR 1

సుశాంత్ హీరోగా, మీనాక్షి చౌదరీ హీరోయిన్ గా ఎస్.దర్శన్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ఇచ్చట వాహనములు నిలుపరాదు. ఈ చిత్రం ట్రైలర్ తాజాగా విడుదల అయింది. ఈ చిత్రం ట్రైలర్ విడుదల అయిన ఒక్క రోజుకే 2.2 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకోవడం మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉండటం తో సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని ఆగస్ట్ 27 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ల లో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ట్రైలర్ కి వస్తున్న రెస్పాన్స్ తో చిత్ర యూనిట్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్లు తెలుస్తోంది.

తాజా వార్తలు