‘రౌడీ జనార్దన’ కోసం భారీ యాక్షన్ సెట్ ?

‘రౌడీ జనార్దన’ కోసం భారీ యాక్షన్ సెట్ ?

Published on Mar 10, 2026 1:00 AM IST

Rowdy-Janardhana

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా దర్శకుడు రవి కిరణ్‌ కోలా తెరకెక్కిస్తున్న సినిమా ‘రౌడీ జనార్దన’. ప్రస్తుతం ఈ సినిమా కొత్త షెడ్యూల్ కోసం ఓ భారీ సెట్ వేస్తున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ సెట్ వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సెట్ లో ఇంటర్వెల్ ను షూట్ చేస్తారట. అలాగే, ఈ సెట్ లో కొన్ని యాక్షన్ సీన్స్ ను కూడా తీస్తారని.. ఈ సీన్స్ ను విజయ్ దేవరకొండ పై షూట్ చేస్తారని తెలుస్తోంది. ఇక ఈ మూవీలో సీనియర్ హీరోయిన్ శోభన నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

కాగా స్టార్ ప్రొడ్యూసర్ దిల్‌రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో సీనియర్‌ హీరో రాజశేఖర్‌ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. అన్నట్టు రాజశేఖర్ పాత్ర అండ్ ఆయన లుక్ మునుపెన్నడూ చూడని రీతిలో ఉంటుందట. ఇప్పటికే, లుక్‌ టెస్ట్‌ కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. కాగా ఈ సినిమా కథ గ్రామీణ నేపథ్యంలో సాగనుంది. ఈ సినిమాలో విజయ్‌కు జోడీగా కీర్తి సురేశ్‌ నటించనుంది. మొత్తానికి ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.

తాజా వార్తలు