సుధీర్ బాబు హీరోగా, ఆనంది హీరోయిన్ గా కరుణా కుమార్ దర్శకత్వం లో తెరకెక్కిన తాజా చిత్రం శ్రీదేవి సోడా సెంటర్. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. సర్వత్రా ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వస్తోంది. ఈ చిత్రం పై తాజాగా రానా దగ్గుపాటి కీలక వ్యాఖ్యలు చేశారు. శ్రీదేవి సోడా సెంటర్ చాలా ఆకట్టుకుంటుంది అని అన్నారు. స్ట్రాంగ్ మెసేజ్ ఇందులో చూపించడం జరిగింది అంటూ చెప్పుకొచ్చారు. సుధీర్ బాబు నటన పై ప్రశంసల వర్షం కురిపించారు. ఇది తన బెస్ట్ అంటూ చెప్పుకొచ్చారు. మరొక రా చిత్రాన్ని డైరెక్టర్ కరుణా కుమార్ అందించారు అని, బిగ్ స్క్రీన్ పై ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేయండి అంటూ చెప్పుకొచ్చారు.
శ్రీదేవి సోడా సెంటర్ చిత్రం ఆగస్ట్ 27 వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. విజయ్ చిల్లా, శశి దేవీ రెడ్డి లు ఈ చిత్రాన్ని నిర్మించారు.


