తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ నూతన కార్యవర్గంలో ఎవరెవరున్నారంటే?

తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ నూతన కార్యవర్గంలో ఎవరెవరున్నారంటే?

Published on Aug 28, 2021 5:06 PM IST

TFI 2

తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ 76వ జ‌న‌ర‌ల్ బాడీ సమావేశం నేడు జ‌రిగింది. ఈ సమావేశంలో రాబోవు రెండు సంవత్సరాలకు (2021-23)గాను కొనసాగబోయే నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అయితే ఈ నూతన కార్యవర్గానికి ప్రెసిడెంట్‌గా సునీల్ నారంగ్‌, వైస్ ప్రెసిడెంట్స్‌గా బాల‌గోవింద్ రాజ్ త‌డ్ల‌, వి.ఎల్‌.శ్రీధ‌ర్‌, ఎ.ఇన్నారెడ్డి(కో అప్టెడ్‌) ఎన్నికయ్యారు.

ఇక కార్య‌ద‌ర్శిగా కె.అనుప‌మ్ రెడ్డి, సంయుక్త కార్య‌ద‌ర్శిగా జె.చంద్ర‌శేఖ‌ర్ రావు, కోశాధికారిగా ఎం.విజేంద‌ర్ రెడ్డిలు ఎన్నికయ్యారు. ఎగ్జిక్యూటివ్ క‌మిటీలో బి.లింగం గౌడ్‌, డి.విష్ణు మూర్తి, పి.సుబ్ర‌మ‌ణ్యం, ర‌వీంద్ర గోపాల్‌, జి.శ్రీనివాస్‌, బి.స‌త్య‌నారాయ‌ణ గౌడ్‌, జి.శ్రీనివాస్ రెడ్డి, బి.విజ‌య్ కుమార్‌, చెట్ల ర‌మేశ్‌, కె.ఉద‌య్ కుమార్ రెడ్డి, ఎం.న‌రేంద‌ర్ రెడ్డి, ఎం.మోహ‌న్ కుమార్‌, కె.అశోక్ కుమార్‌లు ఉన్నారు.

తాజా వార్తలు