‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యిందా?

‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యిందా?

Published on Mar 10, 2026 9:00 AM IST

ustaad-bhagat-singh

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా శ్రీలీల, రాశిఖన్నా హీరోయిన్స్ గా నటించిన లేటెస్ట్ మాస్ ఎంటర్టైన్మెంట్ చిత్రమే ఉస్తాద్ భగత్ సింగ్. దర్శకుడు హరీశ్ శంకర్ తెరకెక్కించిన ఈ సినిమా మంచి బజ్ ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా రిలీజ్ కి సమయం దగ్గరకి వస్తుండగా అంతా ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక కోసం కూడా ఎదురు చూస్తున్నారు. సినిమా ప్రీ పోన్ కావడంతో అన్నీ ముందు జరిగాయి.

అందులో భాగంగానే ఇప్పుడు ప్రీ రిలీజ్ వేడుక కూడా షిఫ్ట్ అయ్యింది. లేటెస్ట్ బజ్ ప్రకారం ఈ ఈవెంట్ ఈ మార్చ్ 15న హైదరాబాద్ యూసుఫ్ గూడ గ్రౌండ్స్ లో జరగబోతోంది అని టాక్. మరి దీనిపై అధికారిక క్లారిటీ బయటకి రావాల్సి ఉంది.ఇక ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్, థమన్ లు సంగీతం అందిస్తున్నారు అలాగే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

తాజా వార్తలు