సోనీ లివ్ టాప్ లో ట్రెండ్ అవుతోన్న “వివాహ భోజనంబు”

సోనీ లివ్ టాప్ లో ట్రెండ్ అవుతోన్న “వివాహ భోజనంబు”

Published on Aug 29, 2021 6:32 PM IST

Vivaha

రామ్ అబ్బరాజు దర్శకత్వం లో సత్య, ఆర్జావి హీరో హీరోయిన్ లుగా నటించిన చిత్రం వివాహ భోజనంబు. ఈ చిత్రం ఆగస్ట్ 27 వ తేదీ నుండి సోనీ లివ్ లో స్ట్రీమ్ అవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రాన్ని కే. ఎస్. సినిష్ మరియు సందీప్ కిషన్ లు సంయుక్తంగా నిర్మించారు. సందీప్ కిషన్ మూడవసారి నిర్మాతగా వ్యవహరిస్తున్న చిత్రం ఇది.

ఈ చిత్రం విడుదల అయి ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. సినిమా కి కుటుంబ సభ్యుల నుండి భారీ రెస్పాన్స్ రావడం మాత్రమే కాకుండా, సోనీ లివ్ లో ఈ చిత్రం టాప్ లో ట్రెండ్ అవుతోంది. ఈ చిత్రం కేవలం తెలుగు లో మాత్రమే కాకుండా, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ప్రేక్షకులను అందుబాటులో ఉండటం తో ఎక్కువగా వ్యూస్ వస్తున్నాయి. ఈ చిత్రం లో సందీప్ కిషన్, దయానంద్ రెడ్డి, శ్రీకాంత్ అయ్యంగార్, వైవా హర్ష లు కీలక పాత్రల్లో నటించారు.

తాజా వార్తలు