‘లక్ష్య’ షూటింగ్ పూర్తి చేసిన నాగశౌర్య !

‘లక్ష్య’ షూటింగ్ పూర్తి చేసిన నాగశౌర్య !

Published on Aug 30, 2021 7:26 PM IST

లవర్ బాయ్ ఇమేజ్ తో క్లాస్ హీరోగా రాణిస్తున్న నాగశౌర్య హీరోగా సంతోష్‌ జాగర్లపూడి దర్శకత్వంలో రాబోతున్న సినిమా లక్ష్య. కాగా తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తి అయింది. ఈ మేరకు చిత్రబృందం అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేసింది. ఇక ఆర్చరీ స్పోర్ట్స్ నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కుతుండగా నాగ శౌర్య విలుకాడు వలె కనిపిస్తాడట.

కాగా నారాయణ్ దాస్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ నిర్మాతలు గా శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్స్ మీద నిర్మిస్తున్నారు. కేతిక శర్మ ఈ మూవీలో నాగ శౌర్యకు జంటగా నటిస్తున్నారు. ఈ సినిమాకు కాలభైరవ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో జగపతిబాబు, సచిన్ ఖేడ్కర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు