భారీ డీల్ కి నో చెప్పిన ఐకాన్ స్టార్..కారణం ఇదేనట.!

భారీ డీల్ కి నో చెప్పిన ఐకాన్ స్టార్..కారణం ఇదేనట.!

Published on Apr 20, 2022 5:00 PM IST

Allu Arjun
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రీసెంట్ గా నటించిన భారీ సినిమా “పుష్ప ది రైజ్” తో పాన్ ఇండియా లెవెల్లో తన స్టార్డం కూడా రైజ్ చేసి భారీ హిట్ ని అందుకున్నాడు. ఎక్కడో తనకున్న ఫేమ్ పై ముఖ్యంగా హిందీ బెల్ట్ లో చాలా మందికి ఉన్న అనుమానాలను అల్లు అర్జున్ బ్రేక్ చేసి తన స్టార్డం ని ప్రూవ్ చేసాడు. అయితే దీనితో పాటుగా అల్లు అర్జున్ పలు బ్రాండ్స్ కి అంబాసిడర్ గా కూడా చేస్తాడన్న సంగతి తెలిసిందే.

అలాగే ప్రస్తుతం కొన్ని చేస్తున్నాడు కూడా. అయితే వీటిలో ఓ ప్రముఖ పొగాకు సంబంధిత సంస్థ నుంచి భారీ మొత్తంలో ఆఫర్ తన దగ్గరకి రాగా అల్లు అర్జున్ ససేమిరా నో చెప్పేశాడట. ప్రజల ఆరోగ్యానికి కలిగించే ప్రొడక్ట్స్ కి తాను బ్రాండ్ అంబాసిడర్ గా చెయ్యను అని ఆ భారీ డీల్ కి నో చెప్పేసినట్టుగా తెలుస్తుంది. ఇక ప్రస్తుతం అయితే మళ్ళీ తన హిట్ సినిమా పుష్ప కి సీక్వెల్ కోసం మళ్ళీ సిద్ధం అవుతున్నాడు ఈ షూటింగ్ ఈ రెండు నెలల్లో మొదలు కానుంది.

తాజా వార్తలు