యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా రష్మికా మందన్నా కీలక పాత్రలో బాలీవుడ్ యంగ్ హీరోయిన్ “జెర్సీ” ఫేమ్ మృణాల్ ఠాకూర్ నటించిన లేటెస్ట్ మల్టీ లాంగువాల్ చిత్రం “సీతా రామం” కోసం అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ వారు సమర్పణలో రిలీజ్ చేస్తుండగా గత కొన్ని రోజులు నుంచి ఈ సినిమాపై కొన్ని వార్తలు బయటికి వచ్చి వైరల్ అయ్యాయి.
ఈ సినిమాకి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ స్పెషల్ గెస్ట్ గా రాబోతున్నాడని టాక్ రాగా ప్రభాస్ హాజరు కావట్లేదని కన్ఫర్మ్ అయ్యింది. అయితే దీనికి గల అసలు కారణాన్ని అయితే నిర్మాత అశ్వని దత్ రివీల్ చేశారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ కి ప్రభాస్ హాజరు కావట్లేదని తాను ఆ సమయానికి ఓ చిన్న సర్జరీ నిమిత్తం విదేశాలకు వెళ్తున్నారని అసలు విషయం చెప్పి క్లారిటీ ఇచ్చారు. ఇక హను రాఘవపూడి తెరకెక్కించిన సీతా రామం చిత్రం ఈ ఆగస్ట్ 5న రిలీజ్ కాబోతుంది.


