మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా కేతిక శర్మ హీరోయిన్ గా రాబోతున్న తాజా చిత్రం ‘రంగరంగ వైభవంగా’. ‘అర్జున్ రెడ్డి’ తమిళ వెర్షన్ ‘ఆదిత్యవర్మ’ చిత్రాన్ని తెరకెక్కించిన గిరీశయ్య ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. రీసెంట్ గా పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకున్న ఈ సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వచ్చింది. రేపు సాయంత్రం 5 గంటలకు ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ క్రమంలో ఓ సరికొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. పోస్టర్ బాగుంది.
ఇక ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ చాలా యూనిక్ గా ఉంటుందట. అహం పై నడిచే ఈ చిత్రం పూర్తి డిఫరెంట్ పాయింట్ మీద సాగుతుందట. అలాగే.. సినిమాలో హీరో – హీరోయిన్ మధ్య వచ్చే సన్నివేశాలు కూడా చాలా ఎంటర్ టైన్ గా ఉంటాయట. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై ప్రముఖ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా దేవిశ్రీప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. రొమాంటిక్ లవ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం పై మంచి అంచనాలు ఉన్నాయి.


