“సలార్” నుంచి క్రేజీ లుక్ లో మళయాళ స్టార్ హీరో.!

“సలార్” నుంచి క్రేజీ లుక్ లో మళయాళ స్టార్ హీరో.!

Published on Oct 16, 2022 10:58 AM IST

salaar 1
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా మాస్ అండ్ సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం “సలార్” కోసం అందరికీ తెలిసిందే. మరి భారీ అంచనాలు ఉన్న చిత్రం నుంచి నుంచి ఈరోజు మేకర్స్ ఓ సాలిడ్ అనౌన్సమెంట్ ని అందిస్తున్నట్టు తెలిపారు. మరి ఈ చిత్రం నుంచి అయితే మేకర్స్ మళయాళ స్టార్ హీరో పృథ్వీ ని ఈ సినిమాలో కన్ఫర్మ్ చేస్తూ షాకింగ్ అండ్ క్రేజీ ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేయడం ఆసక్తిగా మారింది.

మరి ఈ లుక్ లో అయితే పృథ్వీ నెవర్ బిఫోర్ లుక్ లో కనిపిస్తున్నాడు. తనని వరదరాజ మన్నార్ అంటూ నీల్ కూడా అతడికి ఓ ఐకానిక్ క్రూరమైన రోల్ డిజైన్ చేసినట్టు క్లియర్ గా కనిపిస్తుంది. తన బొట్టు ముక్కు చెవులు మెడలలో రింగులు అన్నీ చూస్తుంటే చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది. దీనితో ఇప్పుడు ఆడియెన్స్ లో మరింత స్థాయిలో అంచనాలు సెట్టయ్యాయి. ఇక ఈ భారీ చిత్రానికి రవి బసృర్ సంగీతం అందిస్తుండగా హోంబళే ఫిల్మ్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

తాజా వార్తలు