“రైటర్ పద్మభూషణ్” కి ఈ స్టెప్ భారీగా ప్లస్.?

“రైటర్ పద్మభూషణ్” కి ఈ స్టెప్ భారీగా ప్లస్.?

Published on Feb 8, 2023 5:00 PM IST

Writer Padmabhushan

లేటెస్ట్ గా టాలీవుడ్ లో హిట్ గా నిలిచిన మరో చిత్రం “రైటర్ పద్మభూషణ్”. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సుహాస్ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు షణ్ముఖ ప్రశాంత్ తెరకెక్కించిన ఈ చిత్రం ఆడియెన్స్ ఆదరణను అంతకంతకు అయితే పెంచుకుంటూ వెళ్తుంది. మరి ఈ సినిమాని ప్రేక్షకుల్లో మరింత ముందుకు తీసుకెళ్లడానికి గాను ఓ ఇంట్రెస్టింగ్ స్టెప్ ని మేకర్స్ తీసుకున్న సంగతి తెలిసిందే. తెలుగు స్టేట్స్ లో పలు థియేటర్స్ కి గాను ఈరోజు మొత్తం నాలుగు ఆటలు కూడా మహిళలకి ఫ్రీ గా ప్రదర్శనకి అయితే తీసుకొచ్చారు.

మరి దీనికి గాను అదిరే రెస్పాన్స్ వచ్చినట్టుగా తెలుస్తుంది. ఆల్రెడీ చాలా చోట్ల అధిక శాతంలో మహిళలు రైటర్ పద్మభూషణ్ సినిమా చూసేందుకు ఆసక్తి కనబరచగా ఓవరాల్ గా మేకర్స్ తీసుకున్న ఈ స్టెప్ సక్సెస్ అయ్యిందని చెప్పాలి. అంతే కాకుండా సినిమాకి విపరీతమైన పాజిటివ్ టాక్ మరింత స్థాయిలో విస్తరించే ఛాన్స్ కూడా ఉంది. దీనితో మేకర్స్ తీసుకున్న ఈ స్టెప్ మాత్రం ఈరోజు నుంచి భారీ ప్లస్ అయ్యే ఛాన్స్ గట్టిగా ఉందని చెప్పొచ్చు.

తాజా వార్తలు