ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో భారీ అంచనాలు ఉన్న చిత్రాల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించనున్న సాలిడ్ మాస్ చిత్రం కూడా ఒకటి. ఎన్టీఆర్ కెరీర్ లో 30వ సినిమాగా దర్శకుడు కొరటాల శివతో ఈ సినిమా వాటర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించనున్నారు. మరి జస్ట్ అనౌన్సమెంట్ లోనే సెన్సేషనల్ హైప్ ని సెట్ చేసుకున్న ఈ చిత్రం ఎప్పుడెప్పుడు షూటింగ్ ని స్టార్ట్ చేసుకుంటుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇక ఇది అలా అందని ద్రాక్ష లానే వస్తుండగా ఇప్పుడు ఫైనల్ గా ఈ షూట్ కి డేట్ ఫైనల్ అయ్యినట్టుగా తెలుస్తుంది. గత కొన్ని రోజులు కితమే మేకర్స్ అనౌన్స్ చేసినట్టుగా ఫిబ్రవరిలోనే సినిమా స్టార్ట్ అవుతుందట. మరి ఇది ఈ ఫిబ్రవరి 23 నుంచి స్టార్ట్ కానున్నట్టుగా తెలుస్తుంది. మరి దీనిపై ఇంకా అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాకి అనిరుద్ సంగీతం అందిస్తుండగా ఎన్టీఆర్ ఆర్ట్స్ మరియు యువసుధ ఆర్ట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.


