ప్రస్తుతమ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న భారీ చిత్రాల్లో వరల్డ్ లెవెల్ ప్రాజెక్ట్ గా అనౌన్స్ చేసిన సినిమా నే “ప్రాజెక్ట్ కే”. దర్శకుడు నాగశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఓ బిగ్గెస్ట్ స్కై ఫై ఫాంటసీ థ్రిల్లర్ గా తెరకెక్కుతుండగా మేకర్స్ కూడా నిన్ననే సినిమా రిలీజ్ పై మాసివ్ అప్డేట్ ని అందించారు.
ఇక ఇదిలా ఉండగా ఈ సినిమాలో ప్రభాస్ తో పాటుగా దీపికా పదుకొనె, బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ లాంటి అగ్ర నటులు కూడా ఉండగా తాజాగా మరో స్టార్ కూడా సినిమాలో కనిపించే ఛాన్స్ ఉందని రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి ఆ స్టార్ హీరో మరెవరో కాదు రీసెంట్ గా “సీతా రామం” తో భారీ హిట్ అందుకున్న టాలెంటెడ్ హీరో దుల్కర్ సల్మాన్ అట.
తాను సీతా రామం టైం లో ప్రాజెక్ట్ కే పై కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ కూడా చేసాడు. మరి ఇప్పుడైతే తాను కూడా ఉన్నారని రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజం అనేది కాలమే నిర్ణయించాలి.


