ఇండియన్ సినిమా దగ్గర ఉన్నటువంటి ప్రిస్టేజియస్ అవార్డులలో దాదా సాహెబ్ పాల్కే అవార్డ్స్ కూడా ఒకటి. మరి ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమాగా పిలుచుకునే ఇండియన్ సినిమా మొట్ట మొదటి ఫుల్ లెంగ్త్ చిత్ర దర్శకుడు దుందిరాజ్ గోవింద్ పాల్కే స్మారకంగా ప్రతి ఏటా అందించే అత్యుత్తమ పురస్కారాలు ఇవి. మరి ఈసారో 2023 లో అట్టహాసంగా ఈ వేడుకలు ముంబై తాజ్ ల్యాండ్స్ ఎండ్ లో నిన్న రాత్రి జరిగాయి. మరి ఈ ఈవెంట్ లో ఎందరో నటీనటులు దిగ్గజాలు కూడా పాల్గొన్నారు. మరి ఈసారి ఈ అవార్డులు గెలుపొందిన చిత్రాలు నటులు ఇతర వివరాలు లిస్ట్ ఓసారి పరిశీలిద్దాం.
ఉత్తమ చిత్రం – “ది కాశ్మీర్ ఫైల్స్”
ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్ – “రౌద్రం రణం రుధిరం”
ఉత్తమ నటుడు – రణబీర్ కపూర్ (బ్రహ్మాస్త్ర పార్ట్ 1 : శివ)
ఉత్తమ నటి – అలియా భట్ (గంగూబాయి ఖతియావాది)
విమర్శకుల ఉత్తమ నటుడు – వరుణ్ ధావన్ (భేడియా)
విమర్శకులు ఉత్తమ నటి – విద్యాబాలన్ (జల్సా)
ఉత్తమ దర్శకుడు – ఆర్ బాల్కీ (చుప్)
ఉత్తమ సినిమాటోగ్రాఫర్ – పి ఎస్ వినోద్ (విక్రమ్ వేద) – హిందీ
మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్ – రిషబ్ శెట్టి (కాంతారా)
ఉత్తమ సహాయ నటుడు – మనీష్ పాల్ (జగ్జగ్ జీయో)
ఉత్తమ నేపథ్య గాయకుడు (పురుషుడు) – సాచెత్ టాండన్ (మైయా మైను – జెర్సీ)
ఉత్తమ నేపథ్య గాయని (మహిళ) – నీతి మోహన్ (మేరీ జాన్ – గంగూభాయ్ ఖతివాది)
ఉత్తమ వెబ్ సిరీస్ – రుద్ర: ది ఎడ్జ్ ఆఫ్ డార్క్‌నెస్ (హిందీ)
అత్యంత విలక్షణ నటుడు – అనుపమ్ ఖేర్ (ది కాశ్మీర్ ఫైల్స్)
టెలివిజన్ సిరీస్ ఆఫ్ ది ఇయర్ – అనుపమ
టెలివిజన్ సిరీస్‌లో ఉత్తమ నటుడు – ఫనా (ఇష్క్ మే మర్జావాన్) కోసం జైన్ ఇమామ్
టెలివిజన్ సిరీస్‌లో ఉత్తమ నటి – తేజస్వి ప్రకాష్ (నాగిన్)
ఇలా అనేక క్యాటగిరీలలో అయితే ఈ ఉత్తమ పురస్కారాలును ఆయా నటీనటులు మరియు టెక్నీషియన్స్ అయితే అందుకున్నారు.


