ఫోటో మూమెంట్ : పుత్రోత్సాహంతో టాలీవుడ్ యంగ్ నటుడు.!

ఫోటో మూమెంట్ : పుత్రోత్సాహంతో టాలీవుడ్ యంగ్ నటుడు.!

Published on Feb 23, 2023 8:00 AM IST

Naveen

మన టాలీవుడ్ లో ఉన్నటువంటి మంచి టాలెంటెడ్ నటుల్లో యంగ్ నటుడు నవీన్ చంద్ర కూడా ఒకడు. హీరోగా అయినా విలన్ గా అయినా కూడా తన ఇంటెన్స్ నటనతో నవీన్ చంద్ర ఆ రోల్ ని రక్తి కట్టించగలడు. మరి ఈ టాలెంటెడ్ నటుడు అయితే రీసెంట్ గా నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ మాసివ్ యాక్షన్ హిట్ సినిమా “వీరసింహా రెడ్డి” లో కీలక పాత్రలో కనిపించి మెప్పించాడు.

అలాగే ఈ సినిమా హిట్ తో పాజిటివ్ వైబ్స్ లో ఉన్న ఈ యంగ్ నటుడు ఇంట మరో శుభవార్త తో సంతోష వాతావరణం ఏర్పడింది. మరి తాను అయితే పండంటి మగబిడ్డకు తండ్రిని అయ్యానని పలు బ్యూటిఫుల్ పిక్స్ ని సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు. నేను నా ఓర్మా అంటూ తన బాబును ఎత్తుకొని కనిపిస్తున్నాడు. ఇందులో తన పుత్రోత్సాహం ఎంతో ఆహ్లాదంగా కనిపిస్తుంది. దీనితో ఈ గుడ్ న్యూస్ షేర్ చేసుకున్న నవీన్ చంద్రకి సినీ ప్రముఖులు మరియు నెటిజన్స్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

తాజా వార్తలు