టాలీవుడ్ యంగ్ హీరో, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం ఇంకా పేరు పెట్టని వార్ డ్రామాలో నటిస్తున్నాడు. భారతీయ వైమానిక దళానికి నివాళిగా ఈ చిత్రం పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా రూపొందుతోంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో వరుణ్ ఫైటర్ పైలట్‌గా కనిపించనున్నాడు. ఈ చిత్రం వరుణ్ కెరీర్‌లో 13వ చిత్రం. VT13 మేకర్స్ ఈ రోజు ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ను వెల్లడించారు.
ఈ చిత్రంలో కథానాయికగా నటించబోయే నటి పేరును రేపు ఉదయం 10:06 గంటలకు వెల్లడిస్తామని ప్రకటించారు. షార్ట్ అనౌన్స్‌మెంట్ వీడియోని బట్టి చూస్తే, సినిమాలోని హీరోయిన్ కూడా ఎయిర్ ఫోర్స్ పైలట్‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది మేజర్ షెడ్యూల్‌లో మేకర్స్ అనేక కీలక సన్నివేశాలను పూర్తి చేశారు. సోనీ పిక్చర్స్ మరియు రినైసన్స్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి నూతన దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వం వహిస్తున్నారు. ఏడాది చివర్లో సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
#vt13newrecruit pic.twitter.com/zddAvLGSte
— Varun Tej Konidela (@IAmVarunTej) March 2, 2023


