ప్రముఖ కన్నడ దర్శకుడు ఎ హర్ష దర్శకత్వంలో గోపీచంద్ కొత్త చిత్రం ఈరోజు లాంఛనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. గోపీచంద్ 31వ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కెకె రాధామోహన్ నిర్మిస్తున్నారు. ఇంకా పేరు పెట్టని ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెల నుంచి ప్రారంభం కానుంది.
కేజీఎఫ్ ఫ్రాంచైజీ తో ఫేమ్ అయిన శాండల్‌వుడ్ మ్యూజిక్ కంపోజర్ రవి బస్రూర్ ప్రస్తుతం ప్రభాస్ సలార్ కి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, ఇప్పుడు ఈ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్, ప్రభాస్ సలార్ చిత్రం తర్వాత హీరో గోపీచంద్ కోసం సంగీతం అందించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ హై ఆక్టేన్ యాక్షన్ ఎంటర్టైనర్ కోసం ట్యూన్లను అందించడానికి రవి బస్రూర్ సంతకం చేయడం జరిగింది. ఈ చిత్రానికి సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.


