కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా ఇప్పుడు తన కెరీర్ లో 19వ సినిమాని ఆల్రెడీ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే కేజీయఫ్ లాంటి మాసివ్ హిట్స్ తర్వాత ఆ రేంజ్ లో హైప్ తేవాలి అంటే మళ్ళీ అది మామూలు విషయం కాదు. దీనితో అందుకే హీరోతో పాటుగా డైరెక్టర్ బ్రాండ్ కూడా ఎంతో అవసరం. ఈ సినిమాకి ఆల్రెడీ ప్రొడక్షన్స్ హౌస్ అయితే లాక్ అయ్యింది కానీ దర్శకుడు ఎవరు అనేది ఇంకా సప్సెన్స్ గానే ఉంది.
అయితే లేటెస్ట్ గా శాండిల్ వుడ్ వర్గాలు చెప్తున్నా దాని ప్రకారం అయితే యష్ ఈ నెక్స్ట్ ప్రాజెక్ట్ ని సెన్సేషనల్ పాన్ ఇండియా దర్శకుడు శంకర్ నే టేకప్ చేయనున్నట్టుగా స్ట్రాంగ్ బజ్ వినిపిస్తుంది. నిర్మాణ సంస్థ కే వి ఎన్ ఎంటర్టైన్మెంట్స్ వారు శంకర్ తోనే సినిమా చేయాలని గట్టిగా ట్రై చేస్తున్నారట. దీనితో అయితే ఈ మాసివ్ ప్రాజెక్ట్ ని శంకర్ సారథ్యంలో చూసే ఛాన్స్ ఉందని చెప్పాలి. దీనిపై మాత్రం అధికారిక అనౌన్సమెంట్ ఇంకా రావాల్సి ఉంది.


