షారుఖ్ “జవాన్” లో తన గెస్ట్ రోల్ కు షూట్ పూర్తి చేసిన బన్నీ!

షారుఖ్ “జవాన్” లో తన గెస్ట్ రోల్ కు షూట్ పూర్తి చేసిన బన్నీ!

Published on Apr 10, 2023 3:43 PM IST

AlluArjun Jawan

బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ నటించిన జవాన్‌లో అల్లు అర్జున్‌ని ఒక ముఖ్యమైన పాత్ర కోసం తీసుకున్నట్లు గతంలో పలు పుకార్లు వచ్చాయి. ఈ పుకార్లు అంతకుముందు ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యాయి. అయితే అల్లు అర్జున్ జవాన్‌లో గెస్ట్ రోల్ కి ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసినట్లు తెలుస్తోంది.

బన్నీ జవాన్ లో తన పాత్రకి సంబందించిన షూట్ పూర్తి కావడం మాత్రమే కాకుండా, త్వరలో విడుదల కానున్న ఈ చిత్రం టీజర్ లో కనిపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ప్రస్తుతానికి ఊహాగానం మాత్రమే. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. అయితే ఇదే నిజమని తేలితే అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు ఇక పండగే అని చెప్పాలి.

తాజా వార్తలు