పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ప్రస్తుతం తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. దాదాపుగా పదకొండేళ్ల విరామం తరువాత పవన్, హరీష్ ల క్రేజీ కాంబోలో వస్తున్న మూవీ కావడంతో దీని పై పవన్ ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు ఉన్నాయి. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈమూవీని మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తుండగా రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ దీనికి సంగీతం అందిస్తున్నారు. ఇటీవల రెగ్యులర్ షూట్ ప్రారంభం అయిన ఈమూవీ యొక్క ఫస్ట్ షెడ్యూల్ నేటితో పూర్తి అయింది.
కాగా నెక్స్ట్ షెడ్యూల్ త్వరలో ప్రారంభం కానుండగా దీనిని వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకి తీసుకురానున్నారు. ఇక ఈ సినిమాని కూడా గబ్బర్ సింగ్ మాదిరిగా అన్ని వర్గాల ఆడియన్స్ తో పాటు పవన్ ఫ్యాన్స్ ని కూడా అలరించేలా అత్యద్భుత రీతిన దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. సినిమాలో యాక్షన్ అంశాలతో పవన్ కళ్యాణ్ పాత్ర, పవర్ఫుల్ డైలాగ్స్, ఫైట్స్ వంటివి అందరినీ ఆకట్టుకుంటాయట . ఆ విధంగా దర్శకుడు హరీష్ శంకర్ ఈ స్క్రిప్ట్ ని దశరథ్ తో కలిసి అద్భుతంగా సిద్ధం చేసారని, ఇది కూడా షూర్ షాట్ బ్లాక్ బస్టర్ ఖాయం అని తెలుస్తోంది. కాగా ఈ మూవీ తమిళ హీరో ఇళయదళపతి విజయ్ నటించిన తేరి కి రీమేక్ గా తెరకెక్కుతోంది. రాబోయే రోజుల్లో ఉస్తాద్ భగత్ సింగ్ గురించిన మరిన్ని అప్ డేట్స్ ఒక్కొక్కటిగా రానున్నాయి.


