కోలీవుడ్ సినిమా దగ్గర రీసెంట్ గా వచ్చి సెన్సేషనల్ హిట్ అయ్యిన సినిమా “విడుతలై” పార్ట్ 1 ని తెలుగులో కూడా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. తెలుగులో “విడుదల” గా వచ్చిన ఈ సినిమాలో సూరి హీరోగా నటించగా మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఓ కీలక పాత్రలో అయితే నటించారు. మరి మంచి అంచనాలు బజ్ నమోదు చేసిన ఈ సినిమా అనుకున్నట్టుగానే మంచి ఓపెనింగ్స్ ని ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో అందుకున్నట్టుగా తెలుస్తుంది.
మరి ఈ సినిమా అయితే మొదటి రోజు 1.2 కోట్ల గ్రాస్ ని అందుకుందట. పెద్దగా ప్రమోషన్స్ కూడా లేని ఈ సినిమాకి ఇంత మొత్తంలో వసూళ్లు రావడం అనేది మంచి విషయమే అని చెప్పాలి. ఇక ఈ సినిమాకి రెండో రోజు కూడా మంచి వసూళ్లే నమోదు కానున్నాయని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. మరి వెట్రిమారన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి అయితే మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించగా తెలుగులో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై ఈ సినిమాని రిలీజ్ చేశారు.


