పవన్, సాయి తేజ్ రీమేక్ మూవీ లేటెస్ట్ షూట్ అప్ డేట్

పవన్, సాయి తేజ్ రీమేక్ మూవీ లేటెస్ట్ షూట్ అప్ డేట్

Published on Apr 25, 2023 9:32 AM IST

PKSDT1

పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలయికలో తాజాగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ పై ఒక భారీ మూవీ నిర్మితం అవుతోన్న సంగతి తెలిసిందే. సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ తమిళ సూపర్ హిట్ వినోదయ సిత్తం కి రీమేక్ అనేది తెలిసిందే. కేతిక శర్మ, తనికెళ్ళ భరణి, రోహిణి, బ్రహ్మానందం, సుబ్బరాజు, ప్రియా ప్రకాష్ వారియర్, రాజా చెంబోలు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ మూవీకి థమన్ సంగీతం అందిస్తుండగా దీనిని జులై 28న గ్రాండ్ గా విడుదల చేయనున్నారు.

అయితే విషయం ఏమిటంటే, ఇప్పటికే చాలావరకు షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ యొక్క తాజా షెడ్యూల్ ని హైదరాబాద్ లో వేసిన భారీ సెట్ లో నైట్ షూట్ జరుపుతున్నారు. అలానే వీలైనంత త్వరలో షూట్ మొత్తం పూర్తి చేసి పక్కాగా ప్రకటించిన డేట్ కే మూవీని ప్రేక్షకాభిమానుల ముందుకి తీసుకువచ్చేందుకు యూనిట్ సన్నాహాలు చేస్తోంది.

తాజా వార్తలు