
అల్లరి నరేష్ కథానాయకుడిగా మిర్నా కథానాయికగా యువ దర్శకుడు విజయ్ కనకమేడల దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ కమర్షియల్ ఎమోషనల్ ఎంటర్టైనర్ మూవీ ఉగ్రం. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై గ్రాండ్ లెవెల్లో దీనిని హరీష్ పెద్ది, సాహు గారపాటి నిర్మించగా శ్రీచరణ్ పాకాల సంగీతం అందించారు. మొదటి నుండి అందరిలో భారీ అంచనాలు ఏర్పరిచిన ఉగ్రం మూవీ సమ్మర్ కానుకగా మే 5న ప్రేక్షకాభిమానుల ముందుకి రానుంది.
ఇక విషయం ఏమిటంటే, ఈ మూవీకి సంబందించిన సెన్సార్ కార్యక్రమాలు నేడు పూర్తి అయ్యాయి. ఈ మూవీ టోటల్ రన్ టైం రివీల్ కావాల్సి ఉండగా మూవీకి సెన్సార్ వారు యు / ఏ సర్టిఫికెట్ కేటాయించారు. ఉగ్రం మూవీ నుండి ఇటీవల రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్, ట్రైలర్ అందరినీ ఆకట్టుకుని అంచనాలు మరింతగా పెంచాయి. తన కెరీర్ లో తొలిసారిగా అల్లరి నరేష్ పవర్ఫుల్ పోలీస్ అధికారిగా నటిస్తున్న ఈమూవీ తప్పకుండా బాక్సాఫీస్ వద్ద విజయవంతం అవుతుందని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
This summer, get entertained with THRILLS, ACTION and a lot of RAGE ????????
U/A for #Ugram. In cinemas from May 5th ????
– https://t.co/yOTaz47P9x#UgramOnMay5th ❤️????@allarinaresh @mirnaaofficial @DirVijayK @sahugarapati7 @harish_peddi @SricharanPakala @jungleemusicSTH pic.twitter.com/7RX4dPbpGI
— Shine Screens (@Shine_Screens) April 28, 2023

