సూపర్ స్టార్ మహేష్ ని డైరెక్ట్ చేయనున్న బాబీ?

సూపర్ స్టార్ మహేష్ ని డైరెక్ట్ చేయనున్న బాబీ?

Published on May 2, 2023 11:30 AM IST

Bobby MaheshBabu

టాలెంటెడ్ డైరెక్టర్ బాబీ, వాల్తేరు వీరయ్య చిత్రం తో తన కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌ని సాధించాడు. అతను ఇప్పుడు టాలీవుడ్‌లోని మరో టాప్ స్టార్‌తో కలిసి పనిచేయాలని ఆశిస్తున్నాడు. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, బాబీ తన తదుపరి ప్రాజెక్ట్‌ లలో మహేష్ బాబుతో కలిసి పని చేయాలనుకుంటున్నాడు. ఆయనతో చర్చలు ప్రారంభించినట్లు సమాచారం. బాబీ ఒక స్క్రిప్ట్ ను మహేష్ కు వినిపించినట్లు తెలుస్తోంది.

మహేష్ బాబు చివరి స్క్రిప్ట్‌కి గ్రీన్ సిగ్నల్ ఇస్తే, ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. పరిస్థితులు కుదిరితే, రాజమౌళితో చేసిన సినిమా తర్వాత ఇది మహేష్ తదుపరి చిత్రం కావచ్చు. అనిల్ రావిపూడి కూడా మహేష్ తదుపరి చిత్రానికి దర్శకత్వం వహించడానికి ఆసక్తి చూపుతున్నాడు. కాబట్టి మహేష్ తదుపరి దర్శకత్వం వహించేది బాబీనా లేక అనిల్‌నా అనేది చూడాలి.

తాజా వార్తలు