
పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్, కృతి సనన్ ల కలయికలో ఓం రౌత్ తెరకెక్కించిన ఆదిపురుష్ మూవీ మొదటి నుండి అందరిలో భారీ స్థాయి అంచనాలు ఏర్పరిచింది. ఇక ఈ మూవీని భారతీయ ఇతిహాస గాథ రామాయణం ఆధారంగా తెరకెక్కిస్తుండగా ఇందులో రాఘవ గా ప్రభాస్, సీతగా కృతి నటిస్తున్నారు. రిట్రో ఫైల్స్, టి సిరీస్ ఫిలిమ్స్ సంస్థల పై గ్రాండ్ లెవెల్లో నిర్మితం అయిన ఆదిపురుష్ ట్రైలర్ నేడు కొద్దిసేపటి క్రితం విడుదల చేసారు మేకర్స్. ఈ ట్రైలర్ కి అందరి నుండి సూపర్ గా రెస్పాన్స్ లభిస్తోంది.
ఇక కొద్దిసేపటి క్రితం టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్ తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ఆదిపురుష్ ట్రైలర్ పై అభిప్రాయాన్ని వెల్లడించారు. ఇప్పుడే ఆదిపురుష్ ట్రైలర్ చూసాను నిజంగా గూస్ బంప్స్ వచ్చాయి. నాకు ఒకప్పటి దూరదర్శన్ లో చూసిన రామాయణం రోజులు గుర్తుకు వచ్చాయి అంటూ అప్పటి మెమోరీస్ ని గుర్తుచేసుకున్న వెన్నల కిషోర్, తాను కూడా ఫుల్ జోష్ తో ఆదిపురుష్ మూవీ కోసం వెయిట్ చేస్తున్నట్లు తెలిపారు. కాగా ఆదిపురుష్ మూవీ పలు భాషల్లో జూన్ 16న భారీ స్థాయిలో థియేటర్స్ లో విడుదల కానుంది.
Adipurush???????????????????????????????????????????? Goosebumps!!! Waiiiiting for release day!
Doordarshan days nostalgia with unlimited josh added????????..జై శ్రీరాం#Adipurush #AdipurushTrailerhttps://t.co/Bg7nuoyCbv https://t.co/kKoafMBoFj
— vennela kishore (@vennelakishore) May 9, 2023

