
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అఖిల్ అక్కినేని హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఏజెంట్. ఈ చిత్రంతో ప్రేక్షకులను అలరించలేకపోయాడు అఖిల్. ఇప్పుడు, హీరో నెక్స్ట్ మూవీ గురించి సోషల్ మీడియాలో కొత్త గాసిప్ చక్కర్లు కొడుతోంది. అఖిల్ నెక్స్ట్ ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్‌తో అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. సాహో చిత్రం కి పనిచేసిన అనిల్ కుమార్ ఈ ప్రాజెక్ట్‌కి దర్శకత్వం వహిస్తారని ఇప్పటికే వార్తలు వినిపించాయి.
అయితే బ్యానర్ కానీ, నటుడు కానీ ఇంకా దీనిపై అధికారిక ప్రకటన చేయలేదు. యూవీ క్రియేషన్స్ ప్రభాస్ యొక్క పాన్ ఇండియన్ మూవీ ఆదిపురుష్ మరియు అనుష్క శెట్టి, నవీన్ పోలిశెట్టి ల మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టిని ప్రమోట్ చేయడంలో బిజీగా ఉంది. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

