ప్రభాస్ పై ఇంట్రెస్టింగ్ రిప్లై ఇచ్చిన మాళవిక.!

ప్రభాస్ పై ఇంట్రెస్టింగ్ రిప్లై ఇచ్చిన మాళవిక.!

Published on May 20, 2023 10:00 AM IST

malavika mohan

ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా పలు చిత్రాలు చేస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ చిత్రాల్లో దర్శకుడు మారుతీ తో ఓ ఇంట్రెస్టింగ్ ఎంటర్టైనర్ ని అయితే ఫ్యాన్స్ కి ఫీస్ట్ ఇచ్చేలా ప్రభాస్ చేస్తున్నాడు. మరి ఈ చిత్రంలో హీరోయిన్ గా కోలీవుడ్ యంగ్ బ్యూటీ మాళవిక మోహనన్ నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మరి తాను అయితే ఈ చిత్రంలో ప్రభాస్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడంతో ప్రభాస్ ని దగ్గర నుంచి కూడా చూసింది.

మరి ఈ ఎక్స్ పీరియెన్స్ లో అయితే ప్రభాస్ పై ఇంట్రెస్టింగ్ రిప్లై లేటెస్ట్ తన సోషల్ మీడియా సెషన్ లో ఇచ్చింది. ప్రభాస్ కోసం ఫ్యాన్స్ సింగిల్ వర్డ్ అడగగా ప్రభాస్ “చరిష్మాటిక్” గా ఉంటారని ప్రభాస్ కటౌట్ చరిష్మా కోసం చెప్పింది. దీనితో ఈ మాస్ రిప్లై తో అయితే ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తుండగా వీరి జంట కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం వీరి సినిమా షూట్ హైదరాబాద్ లో జరుగుతుంది.

తాజా వార్తలు