లేటెస్ట్..”నాని 30″ మరో కీలక షెడ్యూల్ పూర్తి.!

లేటెస్ట్..”నాని 30″ మరో కీలక షెడ్యూల్ పూర్తి.!

Published on Jun 1, 2023 2:07 PM IST

Nani30 1

ఈ ఏడాది తన కెరీర్ లోనే సెన్సేషనల్ హిట్ చిత్రం “దసరా” తర్వాత నాని కెరీర్ లో బెంచ్ మార్క్ చిత్రం 30వ సినిమాని అయితే కొత్త దర్శకుడు శౌర్యువ్ తో ప్లాన్ చేయగా దీనిపై మంచి అంచనాలు అయితే నెలకొన్నాయి. మరి ఇదిలా ఉండగా ఈ సినిమా షూటింగ్ ని మేకర్స్ ఆల్రెడీ స్టార్ట్ చేయగా బ్రిస్క్ పేస్ లో అయితే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అవుతూ వస్తుంది.

ఇక గత కొన్ని వారాల కితమే గోవాలో బ్యూటిఫుల్ షెడ్యూల్ కంప్లీట్ చేసిన మేకర్స్ ఇప్పుడు ముంబై లో స్టార్ట్ చేసిన మరో కీలక షెడ్యూల్ ని అయితే ఇప్పుడు సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసినట్టుగా మేకర్స్ ఇప్పుడు అఫీషయల్ గా కూడా కన్ఫర్మ్ చేశారు.

మరి కొత్త నిర్మాణ సంస్థ వైరా ఎంటర్టైన్మెంట్స్ వారు తమ మ్యాజికల్ జర్నీ ని చూపించడానికి ఎగ్జైటెడ్ గా ఉన్నామని నాని పై ఓ ఇంట్రెస్టింగ్ వీడియో కూడా పెట్టారు. ఇక ఈ ఎమోషనల్ డ్రామాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్ లో పాన్ ఇండియా రిలీజ్ కి రాబోతుంది.

తాజా వార్తలు