
ప్రస్తుతం నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న చిత్రం “భగవంత్ కేసరి” కోసం తెలిసిందే. దర్శకుడు అనీల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్స్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వారిలో కాజల్ అయితే బాలయ్య సరసన మొదటి సారిగా హీరోయిన్ గా నటిస్తుండగా ఇప్పుడు బాలయ్య నెక్స్ట్ ప్రాజెక్ట్ హీరోయిన్ పై అయితే లేటెస్ట్ బజ్ తెలుస్తుంది.
మరి మొన్ననే బాలయ్య కెరీర్ లో 109వ సినిమాని మేకర్స్ దర్శకుడు బాబీతో అయితే అనౌన్స్ చేయగా ఈ సాలిడ్ ప్రాజెక్ట్ లో బాలయ్య సరసన మిల్కీ బ్యూటీ తమన్నా నటించనున్నట్టుగా ఇప్పుడు రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ సినిమా కోసం అయితే తమన్నా పేరు ఫస్ట్ లిస్ట్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి దీనిపై అధికారిక అప్డేట్ అయితే రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రాన్ని అయితే సితార ఎంటర్టైన్మెంట్స్ వారు సహా ఫార్చూన్ 4 ఎంటర్టైన్మెంట్స్ వారు సంయుక్తంగా నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

