ఇటీవల విరూపాక్ష మూవీతో పెద్ద సక్సెస్ సొంతం చేసుకున్న మెగా సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం సముద్ర ఖని దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి చేస్తున్న మూవీ బ్రో. జులై 28న గ్రాండ్ లెవెల్లో ఈమూవీ ప్రేక్షకుల ముందుకి రానుంది. దీని తరువాత యువ దర్శకుడు జయంత్ తో ఒక మూవీ చేయనున్న సాయి తేజ్, దానితో పాటు సంపత్ నంది తో కూడా మరొక మూవీకి కమిట్ అయినట్లు తెలుస్తోంది.
సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ ఈ మూవీని నిర్మించనుండగా దీనికి గాంజా శంకర్ అనే టైటిల్ ని మేకర్స్ పరిశీలిస్తున్నట్లు లేటెస్ట్ టాలీవుడ్ బజ్. ఇటీవల సీటిమార్ మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చిన సంపత్ నంది, సాయి తేజ్ మూవీ కోసం పవర్ఫుల్ స్క్రిప్ట్ ని సిద్ధం చేశారట. కాగా ఈ క్రేజీ కాంబో మూవీ గురించిన మరిన్ని వివరాలు త్వరలో అఫీషియల్ గా వెల్లడి కానున్నాయి.


