రామ్ చరణ్ “గేమ్ చేంజర్” నుండి అంజలి లుక్ రిలీజ్!

రామ్ చరణ్ “గేమ్ చేంజర్” నుండి అంజలి లుక్ రిలీజ్!

Published on Jun 16, 2023 2:42 PM IST

anali

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ గేమ్ చేంజర్. రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం లో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. మేకర్స్ తాజాగా ఈ చిత్రం నుండి అంజలి లుక్ పోస్టర్ ను విడుదల చేయడం జరిగింది. ఈ చిత్రం లో అంజలి కీలక పాత్రలో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.

నేడు నటి పుట్టిన రోజు సందర్భంగా మేకర్స్ ఆమె ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం కి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

తాజా వార్తలు