సూపర్ స్టార్ మహేష్ బాబు కుమార్తె సితార చాలా ఎనర్జిటిక్ గా సరదాగా ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. సితార సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది. తన తండ్రి అభిమానుల కోసం సితార అప్పుడప్పుడు తనకు సంబంధించిన వీడియోలు ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానుల్ని అలరిస్తుంటుంది.
కాగా తాజాగా సితార ఇటీవల లవ్ స్టోరీ సినిమాలోని ‘సారంగదరియా’ పాటకు చక్కని అభినయంతో, క్యూట్ స్టెప్పులతో అలరించింది. ఈ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా, ప్రస్తుతం వైరల్‌గా మారింది. దీంతో ఈ వీడియోను మహేష్ అభిమానులు షోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తూ సూపర్ స్టార్ పై తమ అభిమానాన్ని చాటుకున్నారు.


