‘కెప్టెన్ మిల్లర్’ ఆడియో రైట్స్ దక్కించుకున్న ప్రముఖ సంస్థ

‘కెప్టెన్ మిల్లర్’ ఆడియో రైట్స్ దక్కించుకున్న ప్రముఖ సంస్థ

Published on Jun 28, 2023 8:00 PM IST

Captain Miller 1

వెర్సటైల్ యాక్టర్ ధనుష్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామా మూవీ కెప్టెన్ మిల్లర్. అరుణ్ మథేశ్వరన్ కెప్టెన్ మిల్లర్ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను జూన్ 30న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇటీవల ప్రకటించారు. అయితే లేటెస్ట్ న్యూస్ ఏంటంటే ప్రముఖ మ్యూజిక్ లేబుల్ సరిగమ ఈ సినిమా ఆడియో రైట్స్‌ని ఫ్యాన్సీ ధరకు కైవసం చేసుకుంది.

అలాగే ఫస్ట్ సింగిల్‌ని అతి త్వరలో విడుదల చేయనున్నట్లు వారు తెలిపారు. శివ రాజ్‌కుమార్, సందీప్ కిషన్, ప్రియాంక మోహన్, నివేదిత సతీష్, ఆర్‌ఆర్‌ఆర్ ఫేమ్ ఎడ్వర్డ్ సోనెన్‌బ్లిక్ ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సత్యజ్యోతి ఫిలింస్ కెప్టెన్ మిల్లర్ సినిమాని భారీ బడ్జెట్‌ తో నిర్మిస్తోంది. కాగా ఈ సినిమాకి జివి ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు.

తాజా వార్తలు