ప్రస్తుతం మన తెలుగులో డబ్బింగ్ అవుతూ మరిన్ని చిత్రాలు కన్నడ నుంచి గాని తమిళ్ సినిమా నుంచి గాని విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. అలాగే గత కొన్నాళ్ల కితమే కోలీవుడ్ నుంచి మొదట అక్కడ రిలీజ్ అయ్యి తర్వాత తెలుగులో రిలీజ్ కి వచ్చిన చిత్రం “విడుదల 1” కాగా ఇపుడు మరో హిట్ సినిమా అయితే తెలుగు వెర్షన్ రిలీజ్ కి వస్తుంది.
మరి తమిళ నాట సీనియర్ నటుడు వడివేలు, యంగ్ హీరో ఉదయనిధి స్టాలిన్ ప్రధాన పాత్రల్లో మరో టాలెంటెడ్ నటుడు ఫహద్ ఫాజిల్ మరియు హీరోయిన్ కీర్తి సురేష్ లు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రమే “మామన్నన్”. మరి ఈ చిత్రాన్ని మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించగా ఈ చిత్రానికి లెజెండరీ సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించడం విశేషం.
మరి ఈ సినిమాలో తమిళ్ లో పెద్ద హిట్ గా నిలవగా ఇప్పుడు ఈ సినిమా తెలుగు వెర్షన్ అయితే “నాయకుడు” పేరిట రిలీజ్ కావడానికి సిద్ధం అవుతున్నట్టుగా అనౌన్స్ అయింది. ఇక ఈ చిత్రాన్ని తెలుగులో అయితే ప్రముఖ నిర్మాణ సంస్థలు సురేష్ ప్రొడక్షన్స్ వారు అలాగే ఆసియన్ సినిమాస్ వారు ఈ జూలై 14న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. మరి తెలుగులో ఈ చిత్రం ఎలా రాణిస్తుందో చూడాలి.


