మన టాలీవుడ్ లో రీసెంట్ గా వచ్చి మంచి టాక్ తెచ్చుకున్న చిత్రాల్లో రానా దగ్గుబాటి హీరోగా నటించిన “విరాట పర్వం” అలాగే సుడిగాలి సుధీర్ నటించిన హిట్ సినిమా “గాలోడు” లాంటి చిత్రాల్లో ముఖ్య పాత్రల్లో కనిపించి మెప్పించిన టాలీవుడ్ ప్రముఖ నటుడు “రవి రెడ్డి” కథానాయకునిగా పి.వి.ఆర్ట్స్ పతాకంపై వెంకట్ పులగం నిర్మాతగా తల్లాడ సాయికృష్ణ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం “మిస్టరీ”.
మరి గతంలో వి, విరాటపర్వం,గాలోడు లాంటి సినిమా లలో తన నటనతో అందరిని ఆకట్టుకున్న రవి రెడ్డి ఈ సినిమా లో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నట్లు, అలానే ఈ సినిమా ద్వారా ఇండస్ట్రీలో ప్రత్యేక నటుడిగా తనకంటూ ప్రత్యేక స్థానం వస్తుంది అని అన్నారు.ఈ సినిమా లో తల్లాడ సాయికృష్ణ, స్వప్న చౌదరి, సత్య శ్రీ, రవి రెడ్డి, దుగ్గిరెడ్డి వెంకట్ రెడ్డి, అలీ, తనికెళ్ళ భరణి, సుమన్ లు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.


