“గుంటూరు కారం” పై థమన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!

“గుంటూరు కారం” పై థమన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!

Published on Jul 11, 2023 3:01 PM IST

Thaman 1

మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ శ్రీలీల హీరోయిన్ గా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కసితున్న సాలిడ్ మాస్ డ్రామా “గుంటూరు కారం”. మరి మంచి హైప్ ని సెట్ చేసుకున్న ఈ సినిమా విషయంలో సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు డ్రామా కూడా పెద్ద ఎత్తున నడుస్తూ వస్తుంది.

సినిమా అంతకంతకూ ఆలస్యం అవుతూ ఉండడం ఊహించని విధంగా పలు భారీ మార్పులు చేర్పులు చోటు చేసుకుంటూ ఉండడంతో గుంటూరు కారం సినిమాపై మరింత ఆసక్తి ఏర్పడింది. అయితే ఈ సినిమా సంగీత దర్శకుడు థమన్ విషయంలో అయితే మొదటి నుంచి కూడా అలా డ్రామా నడుస్తూ వచ్చింది.

అయితే లేటెస్ట్ గా థమన్ గుంటూరు కారం విషయంలో మాట్లాడ్డం వైరల్ గా మారింది. ఈ చిత్రంపై వచ్చే వదంతులు ఎవరూ నమ్మవద్దని ఈ సినిమాకి 6 నెలలు నుంచి వర్క్ చేస్తున్నాం. ఏదైనా ఉంటే నిర్మాతలే అఫీషియల్ గా చెప్తారని ఏ సినిమా అయినా కూడా లేట్ అవ్వడం కామన్ దానిని భూతద్దంలో పెట్టి పెద్దదిగా చూపించడం అవసరం లేనిది అని అయితే థమన్ క్లారిటీ ఇచ్చాడు.

తాజా వార్తలు