సలార్ పార్ట్ 1 లో ఆ సన్నివేశాలు లేవు – జగపతి బాబు!

సలార్ పార్ట్ 1 లో ఆ సన్నివేశాలు లేవు – జగపతి బాబు!

Published on Jul 16, 2023 4:31 PM IST

Salaar 1

పాన్ ఇండియా స్టార్ హీరో, రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఔట్ అండ్ ఔట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ సలార్. సెప్టెంబర్ 28, 2023 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ చిత్రం నుండి రిలీజైన ప్రచార చిత్రాలకి ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం నుండి రిలీజైన టీజర్ సెన్సేషన్ రెస్పాన్స్ తో దూసుకు పోతుంది. అయితే తాజాగా ఈ చిత్రం కి సంబందించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ ను వెల్లడించారు నటుడు జగపతి బాబు.

ఈ చిత్రం లో ప్రముఖ టాలీవుడ్ నటుడు జగపతి బాబు కీలక పాత్రలో నటిస్తున్నారు. అయితే ఈ సలార్ పార్ట్ 1 లో ప్రభాస్ కి, తనకి కాంబినేషన్ సన్నివేశాలు లేవు అని అన్నారు. ఈ చిత్రం లో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా, పృధ్వీ రాజ్ సుకుమారన్, శ్రియా రెడ్డి లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హొంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ కానున్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

తాజా వార్తలు