ఈ వారం థియేటర్స్ లో రిలీజ్ కి రావడానికి సిద్ధం అవుతున్న లేటెస్ట్ చిత్రాల్లో థ్రిల్లర్ అండ్ యాక్షన్ మూవీ లవర్స్ ని టార్గెట్ గా పెట్టుకొని రిలీజ్ కి రాబోతున్న చిత్రం “హిడింబ” కూడా ఒకటి. మరి దర్శకుడు అనీల్ కన్నెగంటి తెరకెక్కించిన ఈ చిత్రంలో యంగ్ హీరో అశ్విన్ బాబు నటించగా నందిత శ్వేతా హీరోయిన్ గా నటించింది. అయితే ఈ చిత్రాన్ని కూడా నిన్న తెలుగు స్టేట్స్ లో పలు చోట్ల ప్రీమియర్స్ గా వేయగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది.
అయితే ఈ చిత్రంపై లేటెస్ట్ గా టాలెంటెడ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేయడం వైరల్ గా మారింది. హిడింబ నా మైండ్ బ్లాక్ చేసింది. చాలా సహజంగా ఇంట్రెస్టింగ్ గా ఈ చిత్రం ఉందని తెలిపాడు. అలాగే నాకు సెకండాఫ్ లో ఆ ట్విస్ట్ లు చాలా బాగా నచ్చాయి అని “విరూపాక్ష” సినిమా కానీ మీకు నచ్చితే “హిడింబ” కూడా తప్పకుండా నచ్చుతుంది ఖచ్చితంగా ట్రై చెయ్యండి అని సజెస్ట్ చేస్తున్నాడు. దీనితో తన రివ్యూ వైరల్ గా మారింది.
#HIDIMBHA blew me away with its rawness and realistic portrayal of gore!
The film worked for me majorly because of the twists in the second half!
If you liked #Virupaksha you should definitely give this a try!
Congratulations to @imashwinbabu @Nanditasweta @aneelkanneganti pic.twitter.com/Cr0RV4yGLg
— Prasanth Varma (@PrasanthVarma) July 18, 2023


