ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో అత్యంత ప్రతిష్టాత్మకంగా వచ్చిన ‘పుష్ప- ది రైజ్’ చిత్రం సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పుష్ప-2 కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, ‘పుష్ప 2’లో ఓ అతిధి పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అతిధి పాత్రలో ఓ స్టార్ హీరో కనిపిస్తాడని.. ఆ హీరో సూర్య అని కొత్తగా రూమర్ వినిపిస్తోంది. ఇక వచ్చే షెడ్యూల్ లో గుంతకల్లు నల్లమల అడవుల ప్రాంతంలో ఓ హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్సెస్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
అల్లు అర్జున్ – ఫహద్ ఫాసిల్ లపై ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ ను సుకుమార్ ప్లాన్ చేశాడట. ఈ యాక్షన్ సీక్వెన్స్ సినిమాలోనే మెయిన్ హైలైట్ గా ఉంటుందట. మొత్తానికి పుష్ప 2 సినిమాని సుకుమార్ వెరీ ఇంట్రెస్ట్ గా ప్లాన్ చేశాడు. పైగా ఈ పుష్ప సీక్వెల్ లో కొన్ని కీలక పాత్రలతో పాటు పలు కొత్త పాత్రలు కూడా ఈ పుష్ప 2లో పరిచయం కానున్నాయి. అందుకే పుష్ప 2 కోసం ఫ్యాన్స్ రెట్టింపు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మించింది. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు.


