
కోలీవుడ్ ఇళయ దళపతి విజయ్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కించిన క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం “వారసుడు” కోసం తెలిసిందే. మరి తమిళ్ సహా తెలుగులో కూడా భారీ హిట్ అయ్యిన ఈ చిత్రం ఈ ఏడాది కోలీవుడ్ లో బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా అయితే నిలిచింది.
ఇక ఈ చిత్రం నుంచి అయితే సంగీత దర్శకుడు థమన్ చార్ట్ బస్టర్ ఆల్బమ్ సహా సాలిడ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ని కూడా అందించడంతో ఫ్యాన్స్ ఎప్పుడు నుంచో ఈ సినిమా ఓ ఎస్ టి(ఒరిజినల్ సౌండ్ ట్రాక్) కోసం ఎదురు చూస్తుండగా ఆ మధ్య రిలీజ్ చేస్తానని చెప్పిన థమన్ తర్వాత దానిని మర్చిపోయాడు.
ఇక ఫైనల్ గా అయితే ఈ అవైటెడ్ ఓ ఎస్ టి రిలీజ్ పై ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ ని అందించాడు. ఈ సినిమా సౌండ్ ట్రాక్ ని అయితే ఈ ఆగస్ట్ 15న రిలీజ్ చేస్తున్నామని తెలిపాడు. దీనితో ఫైనల్ గా విజయ్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Guys #VarisuOst is 100 % coming it has more than 25 Solid tracks .. I am working on it . Delay is due to ongoing commitments. I have to put my heart ❤️ and send it with love to u all !!
I knw I have delayed it but this time I Will Not miss it ❗️#Aug15th i will surely Release…
— thaman S (@MusicThaman) July 31, 2023

