నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా దర్శకుడు అనీల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కిస్తున్న సాలిడ్ మాస్ యాక్షన్ డ్రామా “భగవంత్ కేసరి” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ సినిమా నుంచి వస్తున్నా ఒకో ప్రమోషనల్ కంటెంట్ భారీ హైప్ ని తీసుకొస్తుండగా వీరసింహా రెడ్డి తర్వాత బాలయ్య క్రేజీ హిట్ కొట్టనున్నారని ఇప్పటికే అర్ధం అయ్యింది.
అయితే ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కంప్లీట్ అవుతుండగా నెక్స్ట్ ఈ చిత్రం నుంచి వరుస అప్డేట్స్ రానున్నట్టుగా తెలుస్తుంది. లేటెస్ట్ బజ్ ప్రకారం అయితే ఈ ఆగస్ట్ మూడో వారం నుంచి భగవంత్ కేసరి మేనియా స్టార్ట్ కానున్నట్టుగా తెలుస్తుంది. సో అక్కడ నుంచి నందమూరి ఫ్యాన్స్ కి ఫీస్ట్ స్టార్ట్ అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా శరత్ కుమార్ శ్రీలీల తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే షైన్ స్క్రీన్ సినిమాస్ వారు ఈ చిత్రాన్ని నిర్మాణం వహిస్తున్నారు.


